మిర్యాలగూడలో విద్యుత్ శాఖ సిబ్బందికి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారి ఎస్ యాదగిరి, ఎన్ బెంజిమెన్ విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.
సబ్ స్టేషన్లు, కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్పందించాల్సిన తీరును క్షుణ్ణంగా వివరించారు.
మాక్ డ్రిల్ నిర్వహణలో సిబ్బందితో ప్రత్యక్షంగా డెమో చేయించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు విద్యుత్ శాఖలో పని చేసే ప్రతి ఒక్కరికీ అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలని తెలిపారు.












