భైంసా, జులై 22
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆర్జిదారుల వినతులను పరిశీలించి, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఆర్జిదారుల వినతులను పరిశీలించి ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ, బాధితులకు చట్టపరమైన సహాయాన్ని వెంటనే అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో కొన్ని కుటుంబాలు తిరిగి కలిసేలా పరిష్కారం లభించింది. నిర్మల్ వరకు రావాల్సిన అవసరం లేకుండా భైంసాలోనే కౌన్సిలింగ్ నిర్వహించడంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
గత గ్రీవెన్స్ కార్యక్రమాల్లో అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని ఎస్పీ సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.












