ఆడెల్లి తండా లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. *బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
సారంగాపూర్ జులై 04 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండలంలోని ఆడెల్లి గ్రామ అనుబంధ గ్రామం ఆడెల్లితండా లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం రూ 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు, పనుకు శంకుస్థాపన చేసి మాట్లాడారు..
అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
భారత ప్రభుత్వ నిధులతో చేపట్టబడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని అన్నారు.ఈ సందర్బంగా
తండాకు వచ్చిన ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ దండు సాయన్న,ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్,తండా నాయకులు ప్రేమ సింగ్,
పి ఆర్ డి.ఈ తుకారాం,నాయకులు కాల్వ, నరేష్, వడ్డే రాజేందర్ రెడ్డి,గంగారెడ్డి, పతని నర్సయ్య,శేఖర్ గౌడ్,
తండా వసూలు పాల్గొన్నారు.












