హైదరాబాద్, జులై 19
మతం మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయాలని ఆదేశించింది.
మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ తీర్పులో లోపాలు లేవని, రివ్యూ చేయాల్సిన అంశాలేవీ లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 24న హైకోర్టు వెలువరించిన తీర్పు యధాతధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాపట్ల జిల్లా పిట్ల వాని పాలెం మండలం కొత్తపాలెం లో 2021 లో జరిగిన ఘటన నేపథ్యంలో చింతల ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకొని వెళుతున్న సమయంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో అక్కల రామిరెడ్డి,తో సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తాను క్రైస్తవ మతస్థుడనని పేర్కొన్న ఆనంద్కు ఎస్సీ హోదా ఆధారంగా అట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరిస్తే రాజ్యాంగపరం గా ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆనంద్కు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.












