మిర్యాలగూడ, జూన్ 28
మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు మహమ్మద్ మహిముద్ను ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సీనియర్ జర్నలిస్టు ఖాజా హమీదుద్దీన్ మాట్లాడుతూ, ఉద్యమంలో మహిమూర్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. గ్రామ సర్పంచ్ పిసికే ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు మహమ్మద్ మహిముద్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఖాజా హమీదుద్దీన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొని, ఉద్యమ తీవ్రతను గ్రామస్థాయికి తీసుకుపోవడంలో మహిమూర్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మహమూద్ తన సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిసికే ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు బంటు వెంకటేశ్వర్లు, క్రాంతి, దశరథ నాయక్, నాగభూషణం, వార్డు సభ్యులు మిడతపల్లి శేఖర్, దేవతల సైదులు, మిడతపల్లి సైదులు, సీనియర్ కార్యకర్తలు పోలేని కృష్ణ, దర్శనం శివ సాయికుమార్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.












