తెలంగాణ, 16 July
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు TGSPDSL సరికొత్త వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలపై నేరుగా అధికారులతో సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి TGSPDSL సరికొత్త వాట్సప్ సేవలను ప్రారంభించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈ (AE)లతో నేరుగా సంప్రదించి విద్యుత్ కోతలు, మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, లో-వోల్టేజ్ వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.
ప్రస్తుతం ఉన్న 1912 కాల్ సెంటర్కు ప్రత్యామ్నాయంగా, సేవల్లో జాప్యాన్ని తగ్గించి వేగవంతమైన పరిష్కారాలు అందించడం దీని లక్ష్యం.











