నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని సోనాపూర్ తండా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, అంగన్వాడీ భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలని గ్రామ సర్పంచ్ పెల్యా రామ్ దాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం మండల తహశీల్దార్ సంధ్యారాణికి వినతి పత్రాన్ని అందజేశారు.
గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం తమ గ్రామానికి అత్యవసరమని, ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోదని, అందువల్ల గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కేటాయించాలని సర్పంచ్ కోరారు. ఈ భవనాల నిర్మాణం వల్ల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు తెలిపారు.
తహశీల్దార్ సంధ్యారాణి వినతిని స్వీకరించి, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సోనాపూర్ తండా వాసులు శంకర్, అర్జున్, వసంత రావు, నారాయణ, కాశీరాం, బీమ్ రావు, రతన్ సింగ్, భగవత్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.












