నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులకు సారంగాపూర్ మండల కేంద్రంలో ఘనంగా సన్మానం జరిగింది. ఇటీవల డిసిసి అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటించిన జిల్లా కార్యవర్గంలో పలువురు స్థానిక నాయకులకు స్థానం లభించింది.
జిల్లా అధికార ప్రతినిధిగా ముడుసు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గాజుల రవి, కార్యవర్గ సభ్యుడిగా రాజ్ మహమ్మద్ నియమితులయ్యారు. వీరి నియామకంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
సారంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, నవీన్, మల్లేష్, సాయి, అంబేద్కర్ సంఘం నాయకులు నాగయ్య, శంకర్, ఈశ్వర్, ముత్యం, లక్ష్మణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. నూతన నాయకత్వంలో పార్టీ మరింత పురోగమిస్తుందని కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.












