నిర్మల్, 2026-08-10
నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో 1990 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా (ఏఎస్సై) పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారిని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

పదోన్నతి పొందిన సిబ్బంది వివరాలు
పదోన్నతి పొందిన వారిలో మామడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ 1285 ఎస్.ఎస్. చంద్రప్రకాష్, నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ 547 ఎస్. చంద్రశేఖర్, సోన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ 448 ఏ. సాయన్న ఉన్నారు.
ఎస్పీ సూచనలు
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందించిన సేవలను అభినందించారు. పదోన్నతి సిబ్బంది కృషి, అంకితభావానికి లభించిన గుర్తింపుగా భావించాలని సూచించారు. నూతన హోదాలో మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని కోరారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.