కరీంనగర్, 2026-08-10
సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, అనిమేషన్, కృత్రిమ మేధస్సు () ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం వంటి బహుళ రంగాలలో విశిష్ట సేవలు అందించిన కల్యాణం శ్రీనివాస్‌ను గ్లోబల్ అచివర్స్ కౌన్సిల్, సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ సంయుక్తంగా తెలుగు సాహిత్యంలో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఞకు ఇది మరో మైలురాయిగా నిలిచింది.

సాహిత్యంతో ప్రారంభమైన ప్రస్థానం
కల్యాణం శ్రీనివాస్ సాహిత్యంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయన, పదో తరగతి నుంచే కవిత్వ రచన చేపట్టారు. అనంతరం బి.ఏ. లిటరేచర్, ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే హృదయమన గేయ సంపుటి, పిడికిలి కవితా సంపుటి అనే రెండు పుస్తకాలను ప్రచురించి రచయితగా గుర్తింపు పొందారు. ఆయన రచించిన అనేక గేయాలు వివిధ వేదికల ద్వారా ప్రజల్లోకి చేరాయి.
చిత్రకళ, జర్నలిజం రంగాలలోనూ ప్రతిభ
శ్రీనివాస్ ప్రతిభ చిత్రకళా రంగంలోనూ విలసిల్లింది. 200కు పైగా పుస్తకాలకు ముఖ చిత్రాలు వేయడం ద్వారా ప్రతిభావంతమైన చిత్రకారుడిగా ఆయన విశేష గుర్తింపు పొందారు. అనేక మంది రచయితల రచనలకు కళాత్మక రూపాన్ని అందించారు. జర్నలిజంపై ఆసక్తితో ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు. అదే సమయంలో రాజకీయ కార్టూనిస్టుగా కూడా సేవలందిస్తూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో కార్టూన్లు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.
అనిమేషన్ రంగంలో ప్రపంచ రికార్డు
సంప్రదాయ 2 అనిమేషన్లో రెండు దశాబ్దాల అనుభవం సాధించిన శ్రీనివాస్, 1996లో లక్ష్మీపతి స్కాలర్షిప్ పొందారు. హైదరాబాద్‌లో అనిమేషన్ కోర్సు పూర్తి చేసిన ఆయన, దాదాపు 20 సంవత్సరాలకు పైగా 2 గా అనిమేషన్ పరిశ్రమలో పనిచేశారు. సినిమా భాష, విజువల్ స్టోరీటెల్లింగ్, షాట్ కంపోజిషన్, స్క్రీన్‌ప్లే, కెమెరా వ్యాకరణం, ఎడిటింగ్ వంటి అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అనిమేషన్ రంగంలో పనిచేస్తున్న సమయంలో అనే ప్రముఖ అనిమేషన్ సిరీస్‌లో, సాధారణంగా 20 మంది సీనియర్ అనిమేటర్లు కలిసి రూపొందించాల్సిన ఒక పూర్తి ఎపిసోడ్‌ను, కల్యాణం శ్రీనివాస్ ఒక్కరే కేవలం 22 రోజుల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన కెనడాకు చెందిన అంబర్ వుడ్ ( ) సంస్థ ఆయనకు ప్రత్యేక ప్రశంసా పత్రం ప్రదానం చేసింది. ఈ ఘనత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అనిమేషన్, చిత్రకళ, కార్టూనింగ్ రంగాల్లో ఆయనకు అనేక అవార్డులు, ప్రశంసలు, సన్మానాలు లభించాయి.