తానూరు మండలంలోని దాగం గ్రామంలో పిక్కల్కర్ సవిత–గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పిక్కల్కర్ సవిత–గణేష్ దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి, పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, పేదలందరికీ ఆశ్రయం కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన తెలిపారు.
ముధోల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటిల్, బైంసా వైస్ చైర్మన్ ఎం.డి. ఫరూక్ అహ్మద్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, సర్పంచ్ జి. సాయినాథ్, మాజీ సర్పంచ్ ఎ. సాయినాథ్, వార్డు సభ్యులు మీనాజీ, కమల, ఎస్కే షాధుల్, పండిత్, పిక్కల్కర్ గోవింద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరుణ్, వెంకట్రావు, జి. లక్ష్మణ్, ఎస్. లక్ష్మణ్, మాధవరావు, ఆడేళ్లు, కధం సుశీలబాయి, జుబేదా బీతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.








