బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
ఇచ్చొడ, గుడిహత్నూర్ మండలాల్లోని పొడు భూముల సమస్యల పరిష్కారం, మైనార్టీ వర్గాల అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పలు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న పొడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇచ్చొడ, గుడిహత్నూర్ మండలాల్లోని పొడు భూముల సమస్యల పరిష్కారంతో పాటు మైనార్టీ వర్గాల అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇచ్చొడ, గుడిహత్నూర్ మండలాల పరిధిలోని కేషవపట్నం, బాబ్జిపేట్, గుండాల, లింగాపూర్, జోగిపేట్ గ్రామాల ప్రజలు పొడు భూముల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
అదేవిధంగా మైనార్టీ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖబరస్తాన్లు, ఈద్గాలకు రక్షణ గోడలు మంజూరు చేయాలని, ఇచ్చొడ మండల కేంద్రంలో షాదీఖాన నిర్మాణానికి ప్రభుత్వం అధికారిక అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంపై స్పందించిన మంత్రి అజారుద్దీన్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేషవపట్నం సర్పంచ్ అల్తాఫ్, సదర్ ఇబ్రహీం, సాదిక్, షేక్ సాదిక్, జాకీర్, ఖమర్, జూమ్మ తదితరులు పాల్గొన్నారు.












