లోకేశ్వరం, ఆగస్టు 4
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొననున్నట్లు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం లోకేశ్వరం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శైలజకు ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొననున్నట్లు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం లోకేశ్వరం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శైలజకు ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆదేశాలు, సీఐటీయూ, కేంద్ర-రాష్ట్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం సంయుక్త పిలుపు మేరకు జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడంతో 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయని, దీనివల్ల కార్మికుల హక్కులు బలహీనపడి యజమానులకు ప్రయోజనం కలుగుతోందని వారు ఆరోపించారు.
కొత్త కోడ్ల వల్ల పని భారం పెరగడం, ఉద్యోగ భద్రత తగ్గడం, జీతభత్యాలు, సంక్షేమ పథకాల అమలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల కారణంగా గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకుని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశలు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఆశా వర్కర్ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నంద, సవిత, అర్చన, సుజాత, శారద, అనురాధ, కోమల తదితర ఆశా వర్కర్లు పాల్గొని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శైలజకు వినతిపత్రం అందజేశారు.











