సారాంశం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండా దరఖాస్తుల పంపిణీ చేస్తున్నారని ఆర్మూర్ మండలంలోని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 1అవగాహన లేని పలువురు ఓటర్లు దరఖాస్తులో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
- 2రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండా దరఖాస్తుల పంపిణీ చేస్తున్నారని ఆర్మూర్ మండలంలోని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
- 3ప్రత్యేక శిక్షణ పొందిన బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు దరఖాస్తు ఎలా నింపాలి, ఏ వివరాలు నమోదు చేయాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించి, వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది.
- 4అయితే ఆర్మూర్ మండలంలోని నాలుగో వార్డు, ఐదో వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు దరఖాస్తులు అందించి, వాటిని ఓటర్లు స్వయంగా నింపుకోవాలని సూచిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండా దరఖాస్తుల పంపిణీ చేస్తున్నారని ఆర్మూర్ మండలంలోని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ పొందిన బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు దరఖాస్తు ఎలా నింపాలి, ఏ వివరాలు నమోదు చేయాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించి, వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది.
అయితే ఆర్మూర్ మండలంలోని నాలుగో వార్డు, ఐదో వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు దరఖాస్తులు అందించి, వాటిని ఓటర్లు స్వయంగా నింపుకోవాలని సూచిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవగాహన లేని పలువురు ఓటర్లు దరఖాస్తులో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఓటర్లకు సరైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ విషయంపై నాలుగో వార్డు నాయకుడు నడుకుడ నాగరాజు, ఐదో వార్డు నాయకుడు ఇందూర్ విజయ్ కుమార్ స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.