12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు

12న తెలంగాణ స్థానిక పత్రికల
డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు

అక్రిడిటేషన్లు, ప్రకటనల కేటాయింపులో స్థానిక పత్రికలకు
తీరని అన్యాయం

డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి కంటి శ్రీనివాస్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

కరీంనగర్ : నవంబర్ 06

 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో స్థానిక పత్రికల పట్ల వివక్ష కొనసాగుతోందని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు.

అక్రిడిటేషన్లు, రేట్ కార్డ్ విషయంలో తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలకు
అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆరోపించారు.

బుధవారం కరీంనగర్ డబ్ల్యూజేఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

స్వరాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని స్థానిక పత్రికల యాజమాన్యాలు భావించాయని, అయితే
గడచిన పదేళ్ల కాలంలో
స్థానిక పత్రికల పరిస్థితులు మరింత దిగజారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రాపకంతో, పైరవీలతో కొందరు మాత్రమే పెద్ద పత్రికల ముసుగులో లబ్ధి పొందారని,
విలువలతో నిత్యం పత్రికలు
వెలువరిస్తున్న వారికి మాత్రం తీరని అన్యాయం జరిగిందని
అన్నారు.

12 న స్థానిక పత్రికల
హక్కుల సాధనకై సదస్సు

ఈనెల 12వ తేదీన హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో ‘తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు- అక్రి డిటేషన్లు- రేటు కార్డు’ విషయంలో జరుగుతున్న అన్యాయాలపై
రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ సదస్సులో స్థానిక పత్రికల యాజమాన్యాల నుండి సలహాలు, సూచనలు తీసుకొని
వాటిని క్రోడీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. స్థానిక పత్రికల యాజమాన్యాలకు గుర్తింపు, గౌరవం దక్కేంతవరకు డబ్ల్యూజేఐ
పోరాడుతుందన్నారు.

స్థానిక పత్రికలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అనునిత్యం ప్రభుత్వంతో
ప్రాతినిధ్యం జరుపుతామని
స్పష్టం చేశారు.

12వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే
తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాల సదస్సుకు,
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో
పత్రికలు నిర్వహిస్తున్న ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు.

రాష్ట్ర కమిటీ లోకి…

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అక్రిడికేషన్ సమస్యల పరిష్కార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా
తాడూరు కరుణాకర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా
శివనాద్రి ప్రమోద్ కుమార్, రాష్ట్ర
జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బెజ్జంకి నరేష్
లను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment