ఉచిత అకాడ శిక్షణ కేంద్రం ప్రారంభం

ఉచిత అకాడ శిక్షణ కేంద్రం ప్రారంభం

మనోరంజని ప్రతినిధి రామగుండం సెప్టెంబర్ 19

ఉచిత అకాడ శిక్షణ కేంద్రం ప్రారంభం

ప్రాచీన యుద్ధకళలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.శుక్రవారం ఎన్టిపిసి స్థానిక విశ్వభారతి పాఠశాలలో శ్రీ హనుమాన్ అకాడ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కీర్తిశేషులు కంది రాజయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థిని విద్యార్థులకు అకాడ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కంది నాగరాజును,కంది చంద్రయ్యను ప్రత్యేకంగా అభినందించారు.విజయదశమి దసరా ఉత్సవాలలో భాగంగా అకాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది.ఎన్టీపీసి
విశ్వ భారతి స్కూల్ లో ప్రతిరోజు సాయంత్రం అకాడ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ కంది నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వ భారతి విద్యాసంస్థల చైర్మన్ బంధారపు యాదగిరి గౌడ్,తిరుపతి గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి,ఆసిఫ్ పాషా,మడిపల్లి మల్లేష్, ముస్తఫా,ముచ్చ కుర్తి రమేష్,బొడిగే భరత్ గౌడ్, శ్రీకాంత్,సాయిరాం,కీర్తన్,కంది ఆంజనేయులు,రణధీర్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment