శైలపుత్రి అలంకార దర్శనంతో బాసరలో శరన్నవరాత్రులు ప్రారంభం
బాసర, సెప్టెంబర్ 22 (M4News):
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
“వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||”
సతీదేవి యోగాగ్నిలో తనువు త్యజించి, తరువాత పర్వతరాజు హిమవంతుని పుత్రికగా అవతరించగా, ఆమెకు శైలపుత్రి అనే నామము ఏర్పడింది. వృషభ వాహనంపై విరాజిల్లే అమ్మవారు కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలాన్ని ధరించారు. తలపై చంద్రవంకను ధరించి సుందరంగా అలంకరించారు.
భక్తి భావంతో శైలపుత్రి అమ్మవారిని ఆరాధిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. తొలి రోజు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించారు.
“ఓం శైలపుత్రీ రూప సరస్వత్యై నమః”