- కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని యంచ గ్రామంలో విఠలేశ్వర పల్లకి సేవ ఊరేగింపు
- గల్లీ గల్లీ లో కన్నులపండువుగా సాగిన పాండురంగ విఠలేశ్వర సేవ
- భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం యంచ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ విఠలేశ్వర అఖండ నామ సప్త సంకీర్తన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి గల్లీలో భక్తి శ్రద్ధలతో పాండురంగ విఠలేశ్వర పల్లకి సేవ కన్నుల పండుగలా సాగింది. శుక్రవారం శ్రీ విఠలేశ్వర దేవస్థానంలో జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలో ఉన్న యంచ గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్న శ్రీ విఠలేశ్వర అఖండ నామ సప్త సంకీర్తన ఉత్సవం ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో జరిగింది. పాండురంగ విఠలేశ్వరుని పల్లకి సేవ ప్రతి గల్లీలో కన్నులపండుగగా సాగింది.
ఈ శుక్రవారం శ్రీ విఠలేశ్వర దేవస్థానం వద్ద భక్తుల కోసం జాతర నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని స్వామి వారి ప్రసాదం స్వికరించగలరని కోరారు