భీమారంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలోని రావిచెట్టు వాడ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధవారం తేది 17 సెప్టెంబరు 2025 ఉదయం 11:00 గంటలకు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమం ,కలదు. ఈ సందర్భంగా మద్యాహ్నం 12:00 గంటలకు విశ్వకర్మ పతాకావిష్కరణ కార్యక్రమం , తదనంతరం తీర్థ , ప్రసాద వితరణ , సామూహిక భోజన కార్యక్రమం జరగనుంది కావున ఈ సృష్టి కి మూలం అయిన ఆ విశ్వకర్మ భగవానుడిని పూజ మహోత్సవ వేడుకలలో భీమారం గ్రామ ప్రజలు, కాలనీ వాసులు ,విశ్వ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు అధీక సంఖ్యలో పాల్గోనీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరనీ భీమారం మండల విశ్వబ్రాహ్మణ ఉత్సవ కమిటీ ఆహ్వానిస్తున్నారు.