విజయవాడ గ్రామీణం, 24 July
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2026లో విజయవాడకు చెందిన వైద్యురాలు బిందు పరుచూరి డెడ్ లిఫ్ట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 84 కేజీల విభాగంలో 147.5 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2026లో విజయవాడకు చెందిన వైద్యురాలు బిందు పరుచూరి డెడ్ లిఫ్ట్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. డెడ్ లిఫ్ట్ పోటీల్లో బిందు మాస్టర్స్-1 (40-50 ఏళ్లలోపు), 84 కేజీల కేటగిరీలో తలపడి 147.5 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఇటీవల విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా ఆమె జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఏడాది పాటు సాధన చేసిన అనంతరం, తొలిసారిగా జాతీయ డెడ్ లిఫ్ట్ పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించడం విశేషమని పలువురు వైద్యులు, లిఫ్టర్లు బిందును అభినందించారు.












