మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతడు, సెంచరీకి చేరువగా వచ్చి శతకాన్ని చేజార్చుకున్నారు. 102 మీటర్ల దూరం వెళ్లిన భారీ సిక్స్‌తో అభిమానులను అలరించారు.
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతడు, సెంచరీకి చేరువగా వచ్చి శతకాన్ని చేజార్చుకున్నారు.
ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన వైభవ్, ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
సికందర్ వేసిన 13వ ఓవర్లో ఫ్రంట్ఫుట్కి వచ్చి కొట్టిన ఒక భారీ సిక్స్ ఏకంగా 102 మీటర్ల దూరం వెళ్లింది. బంతి స్టేడియం రూఫ్‌ను తాకి బయట పడటం విశేషం.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 49 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సెంచరీ మైలురాయిని అందుకోలేకపోయినా, తన ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు.












