ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 30
ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు భగవాన్ దాస్ ( రిటైర్డ టీచర్, శ్రీ సరస్వతీ విద్యాపీఠం పూర్వ ఆచార్యులు) విచ్చేసి ప్రార్థనలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. నాలుగు రోజులపాటు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు- ఆచార్యులకు ఆంగ్లం ఇటాలిక్స్ వ్రాతలో మెలకువలు, ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ లో స్కిల్స్ నేర్పనున్నారు. ఈ అవకాశం వచ్చినందుకు విద్యార్థులు, ఆచార్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తరగతులు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని ప్రధానాచార్యులు సారథి రాజు తెలిపారు