శ్రావణమాస ఆరంభ సందర్భంగా వారాహి మాతకు ప్రత్యేక పూజలు
నిజామాబాద్, అమ్మ వెంచర్ లో వైభవంగా కార్యక్రమం
నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్ లో గల శ్రీ వారాహి మాత ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మాంచాల జ్ఞానేంద్ర దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు విశిష్ట అర్చనలు, అలంకరణలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మాంచాల జ్ఞానేంద్ర మాట్లాడుతూ, “వారాహి ఆలయ నిర్మాణానికి సంబంధించి గతంలో హవన-యజ్ఞాలు, ఇటీవలే దేవీ నవరాత్రులు సుహాసినిలచే భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అందుకే ఈ శ్రావణ మాస ఆరంభానికీ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశాం,” అన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ వారాహి మాత దర్శన భాగ్యాన్ని పొందారు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 8:30 నుండి 11:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటాయని తెలిపారు. మొక్కులు తీర్చుకోవాలని ఆకాంక్షించే భక్తులు ఈ సమయాల్లో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఆయన దంపతులు కోరారు.
శ్రావణమాసం అంతటా ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ నిర్వహకులు తెలిపారు