త్రిలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

త్రిలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

తాండూరు కిచన్నపేటలో 200 ఏళ్ల చరిత్ర గల ఆలయాన్ని దర్శించిన ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

కామారెడ్డి (మనోరంజని తెలుగు టైమ్స్ )
త్రిలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు


:
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలంలోని తాండూరు కిచన్నపేట గ్రామంలో ఉన్న 200 సంవత్సరాల చరిత్ర గల త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతుల పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయ ప్రాంగణం నిండింది.

Join WhatsApp

Join Now

Leave a Comment