సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి
కామారెడ్డి, జనవరి 15 (మనోరంజని తెలుగు టైమ్స్):
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో గురువారం వేకువ జామున మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావనతో జీవిస్తే మనసుకు శాంతి కలుగుతుందని, సమాజంలో సౌహార్దం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులతో పాటు మధు, శేఖర్, కిట్టు తదితర భక్తులు పాల్గొన్నారు.