సంక్రాంతి పండుగ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కామారెడ్డి, జనవరి 14 (మనోరంజని తెలుగు టైమ్స్):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేటలో బుధవారం వేకువజామున సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగలను శాంతియుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరుపేరునా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
రైతులు పండించిన పంటలు సమృద్ధిగా, పుష్కలంగా పండాలని, రైతుల జీవితాల్లో చిరునవ్వులు విరాజిల్లాలని, భగవంతుడి కృప ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.