సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆకాష్ గడపాలే
తానూర్ మనోరంజని ప్రతినిధి జూలై 29
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఆకాష్ అన్నారు. మండల కేంద్రమైన తానూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించారు. రోగుల వివరాలు, టీకా కార్యక్రమాలు, మందుల పంపిణీకి సంబంధించిన వివరాలను డాక్టర్ అజీత్ తో అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్ స్టోర్‌ను స్వయంగా తనిఖీ చేసి అక్కడ మందుల నిల్వ సమృద్ధిగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన
కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ అజీత్, సీహెచ్‌వో ఖాసీ అబ్బాసీ, ఫార్మాసిస్ట్ సదానంద గౌడ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గన్నారు