శివాజీ నగర్ ఉపాధి కార్యాలయంలో ప్రత్యేక జాబ్ మేళా
నిజామాబాద్, నవంబర్ 13 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ఉపాధి కార్యాలయంలో గురువారం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ “హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ మేళా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఐటీఐ ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పిక్కర్-ప్యాకర్ వంటి విభాగాల్లో శిక్షణ పొందిన యువత, యువకులకు అవకాశాలు కల్పించబడతాయి,” అని తెలిపారు. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఎంపికైన వారికి నెలకు ₹12,000 నుండి ₹28,000 వరకు వేతనం లభిస్తుందని వివరించారు. వేతనం వారి సీనియారిటీ మరియు అనుభవాన్ని ఆధారంగా నిర్ణయిస్తామని అన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 60 మంది అభ్యర్థులు పాల్గొనగా, వారిలో 25 మంది ఇంటర్వ్యూలలో ఎంపికయ్యారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు.