*మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి*
భైంసా జనవరి 05 మనోరంజని తెలుగు టైమ్స్
గ్రామం లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఇలేగాం గ్రామ సర్పంచ్ సిరం రాజమణి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. వార్డ్ మెంబర్లు వార్డు ల వారిగా సమస్యలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ నిధులు రాగానే దశల వారిగా అభివృద్ధి పనులు చెప్పడతామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా పాటు పడతానని అందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటానన్నారు. సమావేశం లో పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ పి. శ్రీనివాస్, వార్డ్ సభ్యులు శాంతాబాయి, స్వరూప, సవిత సాగర బాయి,కొండిబా, మధుకర్, సుదర్శన్,రెడ్ల రాజు,విష్ణు, కారోబారి అంబదాస్ పాల్గొన్నారు…