శివాజీ నగర్‌లో వాకర్స్ కోసం ప్రత్యేక పరికరాల హామీ – నుడా చైర్మన్ కేశవ వేణు

శివాజీ నగర్‌లో వాకర్స్ కోసం ప్రత్యేక పరికరాల హామీ – నుడా చైర్మన్ కేశవ వేణు

 

శివాజీ నగర్‌లో వాకర్స్ కోసం ప్రత్యేక పరికరాల హామీ – నుడా చైర్మన్ కేశవ వేణు

మనోరంజని ప్రతినిధి జూన్ 23– నిజామాబాద్ ఉదయం 6 గంటలకు శివాజీ నగర్ వాకర్స్ జోన్‌ను నుడా చైర్మన్ కేశవ వేణు సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మనోరంజనంగా ముచ్చటించిన ఆయన, వ్యాయామ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ అవసరమైన పరికరాల్ని త్వరితగతిన అందుబాటులోకి తేనున్నట్లు హామీ ఇచ్చారు.వాకర్స్ అసోసియేషన్ వారు చేసిన వినతిని పరిశీలించిన కేశవ వేణు రాబోయే రెండు నెలల్లో వాకింగ్ ట్రాక్, వ్యాయామ పరికరాలు, మరియు ఇతర అవసరమైన సదుపాయాలన్నీ సమకూరుస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదాన్ని నిజం చేసే విధంగా మేము ముందుకు సాగుతాం,” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నుడా చైర్మన్ కేశవ వేణుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మురళీకృష్ణ, పృథ్విరాజ్, సముద్రాల మధు తదితర వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా శివాజీ నగర్ వాసులకు ఆరోగ్య పరిరక్షణలో మరింత ఉత్తమ వాతావరణం ఏర్పడనుంది

Join WhatsApp

Join Now

Leave a Comment