*రెండు రోజుల్లో సోయా కొనుగోలు ప్రారంభం*
*నియోజకవర్గం లో వంద వరికొనుగోలు కేంద్రాల ఏర్పాటు*
*మండలానికి రెండు మొక్కజొన్న సోయా కొనుగోలు కొనుగోలు కేంద్రాలు*
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 28
రైతులకు మద్దతు ధర రావాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రెండు రోజుల్లో సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు*. తుఫాను వర్షాల కారణంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వరి కొనుగోళ్లకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రామాలకు ఒకటి కలుపుకొని *100 కొనుగోలు కేంద్రాలు* ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మండలానికి రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పత్తి కొనుగోళ్లను త్వరితగతిన ప్రారంభిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల విషయంలో ఈపాటికి జిల్లా ఇన్చార్జ్ మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రి కి విన్నవించడంతోపాటు, అధికారులకు చెప్పడం జరిగిందన్నారు.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్మాలని సూచించారు.