రేపటి నుంచే నిర్మల్ జిల్లాలో సోయా పంట కొనుగోళ్లు ప్రారంభం

రేపటి నుంచే నిర్మల్ జిల్లాలో సోయా పంట కొనుగోళ్లు ప్రారంభం

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు — క్వింటాలకు రూ.5,328 మద్దతు ధర

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, అక్టోబర్ 28

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా పంట కొనుగోళ్లు బుధవారం (రేపటి) నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. రైతులు పండించిన సోయా పంటను ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ఈ అంశాన్ని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీ హరిరావు తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం, రైతుల ప్రయోజనార్థం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించిందని పేర్కొన్నారు. సోయాబీన్ పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించిందని భీమ్ రెడ్డి తెలిపారు. రైతులు తమ పంటను నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం మార్కెట్ యార్డుకు తీసుకురావాలని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment