మానవ హక్కుల కమిటీ అధికార ప్రతినిధిగా సోను వెంకటేష్ నియామకం
జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో నియామక కార్యక్రమం
మనోరంజని ప్రతినిధి, నిజామాబాద్ | ఆగస్టు 03
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్లో గల రామకృష్ణ విద్యాలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మానవ హక్కుల కమిటీ (NHRC) నగర అధికార ప్రతినిధిగా సోను వెంకటేష్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ప్రకటించారు.ఈ సందర్భంగా సోను వెంకటేష్ మాట్లాడుతూ: “నన్ను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , నగర అధ్యక్షురాలు పోలాస జ్యోతి లను హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలిపారు. సంస్థ నిబంధనలకు కట్టుబడి, ప్రజల హక్కులను కాపాడేందుకు సమర్పితంగా పని చేస్తాను. ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం.”అని అన్నారు.ఈ
ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి సముద్రాల మాధురి, నరేందర్ చండాలియా, వెంకటేష్ జె, లక్ష్మణ్, చింతకింది సంతోష్ తదితరులు పాల్గొన్నారు