సోనాపేట్ గ్రామ అభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ అభ్యర్థి తోట నరసవ మల్కేష్
మన రంజని తెలుగు టైమ్స్ – మెండోరా
సోనాపేట్ గ్రామాభివృద్ధికి తన వంతు సేవలను సమర్పించుకోనున్నట్లు సర్పంచ్ అభ్యర్థి తోట నరసవ మల్కేష్ తెలిపారు. గ్రామంలో ముఖ్యంగా విద్య, వైద్య రంగాల పురోభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని మల్కేష్ స్పష్టం చేశారు. సోనాపేట్ అభివృద్ధి కోసం ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ, తమ అమూల్యమైన ఓటును తనకు అప్పగించాలని గ్రామ పెద్దలు, మహిళలు, యువతను అభ్యర్థించారు.