వశిష్ట కళాశాల విద్యార్థులకు ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం
వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాంకుల వెలుగు
ఇంటర్ ఫలితాల్లో గంగోత్రి 985 మార్కులతో ప్రథమ స్థానం
బైపిసి మొదటి సంవత్సరం విద్యార్థులకూ మెరుగైన ఫలితాలు
విద్యార్థులను సన్మానించిన ఇంటర్ విద్యాధికారి పరశురాం
విద్యా పురోగతిపై అభినందనలు తెలిపిన సత్యనారాయణ గౌడ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 23 :-
నిర్మల్ పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాల మరోసారి తన నాణ్యమైన బోధనతో మెరిసింది. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు:
గంగోత్రి – 985/1000
ఆకాష్ – 974
అశ్వజిత్ – 974
మహీం – 963
ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపిసి ఫలితాలు:
చైతన్య – 435
అక్షయ – 432
సంజన – 431
చందన – 429
రిషిత్ – 429
ఆఫ్రిన్, తరుణ్ – 428
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి పరశురాం మరియు కళాశాల ప్రిన్సిపాల్ మహేష్‌లు విజయవంతమైన విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థులు తమ లక్ష్యాల దిశగా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు.
వశిష్ట జూనియర్ కళాశాల గత 12 సంవత్సరాలుగా తల్లిదండ్రుల సహకారంతో, అధ్యాపకుల నైపుణ్యంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ జిల్లాలో మంచి ర్యాంకులను సాధించడమే కాక, తమ ప్రతిభను నిరూపించుకుంటూ వస్తోంది.
విద్యార్థుల విజయంపై కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్‌కి అభినందనలు తెలిపారు.