ఇన్చార్జ్ పిఓ యువరాజ్ మర్మాట్ను సత్కరించిన సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబా శ్యామ్ టైగర్
ఉట్నూర్లో కొత్తగా ఇన్చార్జ్ పిఓగా యువరాజ్ మర్మాట్ బాధ్యతలు స్వీకరణ
సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబా శ్యామ్ టైగర్ ఘన సత్కారం
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తామని యువరాజ్ మర్మాట్ హామీ
మనోరంజని తెలుగు టైమ్స్ ఉట్నూరు ప్రతినిధి నవంబర్ 04
ఉట్నూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జ్ పిఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన యువరాజ్ మర్మాట్ను సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబా శ్యామ్ టైగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మండల నాయకుడు క్రాంతి కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా శ్యామ్ టైగర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో యువరాజ్ మర్మాట్ సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలతో సమీపంగా ఉండి, వారి అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. యువరాజ్ మర్మాట్ స్పందిస్తూ, “ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం సేవలు అందిస్తాను. ప్రజల సహకారంతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది” అని తెలిపారు.