జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడులకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపిన SJWHRC ప్రతినిధులు
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేసి,మాట్లాడుతూ ఈ రోజు పోయింది సామాన్యుల ప్రాణాలు మాత్రమే కాదని, దేశ ఆత్మాభిమానమని కాబట్టి మరొకసారి మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి ఉగ్రవాదములపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులరా ఖబర్దార్ ఖబర్దార్ మతోన్మాదులారా! మా దేశం వైపు కన్నెత్తి చూస్తే మట్టిలో కలిపేస్తాం అంటూ నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా SJWHRC జిల్లా చైర్మన్ ఏ.సుదర్శన్,డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, బైంసా మండల ప్రతినిధులు అడెల్లి సాయికిరణ్, గంధముళ్ల ప్రకాష్ మరియు స్థానికులు చంద్రే విశ్వంభర్,చామనపల్లి మనోజ్, బోసి మహేష్ తదితరులు పాల్గొన్నారు.