అడెల్లి పోచమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తి గానాలతో అలరించిన గాయకులు
మహోత్సవాల్లో సంగీత సుధతో మంత్ర ముగ్దులైన భక్తులు
సారంగాపూర్, నవంబర్ 6, 2025 (M4News):
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ మహా అడెల్లి పోచమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం నవంబర్ 7న శ్రీ చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా గత ఐదు రోజులుగా యజ్ఞయాగాలు, పూజా కార్యక్రమాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి వాతావరణం నెలకొంది.
మణికంఠ మ్యూజికల్ గ్రూప్ గాయకులు ప్రతిరోజూ అమ్మవారికి అంకితమైన భక్తి గీతాలు ఆలపిస్తూ వేల సంఖ్యలో వచ్చే భక్తులను ఆనందంలో ముంచెత్తారు. గాయకులు లక్ష్మారెడ్డి, భీమన్న, నవీన్ భీమన్నతో పాటు పలు గ్రామాల భజన బృందాలు కూడా పాల్గొని తమ గానంతో ఆధ్యాత్మిక మాధుర్యాన్ని అందించారు.
ప్రతిరోజూ ఓపికతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆలయ కమిటీ గాయకులను అభినందించింది. రాబోయే పునఃప్రతిష్ఠా మహోత్సవ ప్రధాన వేడుకకు భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.