- ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ
- బోనాలు, పోతురాజుల నృత్యాలు, భక్తుల భక్తి పారవశ్యం
- అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తుల భాగస్వామ్యం
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని కౌట్ల బి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ధ్వజస్తంభం, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. బోనాలు, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సారంగపూర్:
డిసెంబర్ 14, 2024
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని కౌట్ల బి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ధ్వజస్తంభం, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య స్వామి, గణపతి, శివుడు, విష్ణువు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
వేదగమ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పెళ్లి బ్రహ్మచార్యులు, బ్రహ్మశ్రీ కంచర్ల శివశంకరాచార్యులు మయూరధ్వజుని త్యాగానికి ప్రతిరూపంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోలు, బోనాల నృత్యాలు, శివసతుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించగా, గ్రామస్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అట్ల యశోద పోతా రెడ్డి, ఆలయ నిర్వాహకులు పందేన నరసయ్య, సాట్ల శంకర్, బాసారం కిష్టయ్య, బర్ల సత్తన్న, పూజారి సుంకరి లక్ష్మణ్, ముదిరాజ్ సంఘ సభ్యులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.