శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాత దర్శించిన సీఐ, ఎస్ఐ – భక్తుల చేత సన్మానం
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – సెప్టెంబర్ 26
నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఏఎస్‌ఐ గోజ్జ గంగాధర్ శుక్రవారం శ్రీ గుట్ట వెంకటేశ్వర దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు వారిని ఘనంగా సన్మానించారు.
అలాగే ఆలయ మండపంలో ఏఎస్‌ఐ గోజ్జ గంగాధర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సుమారు 600 మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ అజయ్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు తోట రమేష్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల అశోక్, తోట రవి, తోట రమేష్, బోడ శ్రీనివాస్, బండారి రాజేష్, ఆకుల నర్సయ్య, పతికే రాజేందర్, భవాని స్వాములు తదితరులు పాల్గొన్నారు.