శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు
బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 14
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 83 రోజుల ఆలయ ఉండి లెక్కింపును దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ధర్మకర్త శరత్ పాఠక్ చేపట్టారు. 81 లక్షల 69 వేల 99 రూపాయలు, మిశ్రమ బంగారం 91 గ్రా, 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి మూడు కిలోల 500 గ్రాములు, విదేశీ కరెన్సీ 79 నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపులో ఆలయ ఈవో అంజనదేవి, ఏఈఓ సుదర్శన్, దేవస్థాన పర్యవేక్షకులు శివరాజ్, దేవస్థాన వైదిక, పరిపాలన సిబ్బంది, టీజీబి బ్యాంక్ సిబ్బంది, దేవస్థాన హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా ట్రస్ట్ కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల వారితో పాటు భక్తులు, తదితరులు పాల్గొన్నారు