ప్రతిష్టాత్మక పథకాల అమలులో వేగం పెంచాలి.*

ప్రతిష్టాత్మక పథకాల అమలులో వేగం పెంచాలి.*

క్షేత్రస్థాయిలో చురుకుగా పని చేయాలి:

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రతిష్టాత్మక పథకాల అమలులో వేగం పెంచాలి.*

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 28 – ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాల అమలు పక్కాగా జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె ప్రజల వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం
ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎరువులు-విత్తనాల దుకాణాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, రేషన్ కార్డుల జారీ, వనమహోత్సవం, ఫీవర్ సర్వేలు, వెటర్నరీ క్యాంపులు, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రతి ఓపి రోగికి జ్వరాల పరీక్షలు చేయాలని, ముందస్తు వైద్యం అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం స్కూల్ డే నిర్వహించాలని, వంటకాలు మెనూ ప్రకారం తయారవుతున్నాయా, కూరగాయల నాణ్యత, వంట సరుకుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నదని, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో వివిధ జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment