సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజేశ్వర్ రావు
ముధోల్ మనోరంజని ప్రతినిధి, జులై 17
వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజేశ్వర్ రావు అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత అవసరమని ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో ఎలాంటి వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిలో దోమలు చేరి ఆ దోమలు కుట్టడం ద్వారా డెం గ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకుతా యని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జ్వరం వచ్చినట్లయితే వెంటనే దగ్గ రలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్ల ల పట్ల చాలా జాగ్రత్త తీసుకో వాలని వారిని వర్షపు నీటిలో తడవకుండా చూడాలని వారి దుస్తులను ఎప్పటికప్పుడు మార్చాలని ఇంట్లో గోరువెచ్చగా నీళ్లు చేసుకొని తాగాలన్నారు. ప్రజలు జ్వరం రాగానే నిర్లక్ష్యం చెయ్యొద్దన్నారు. ముందు జాగ్రత్త పడితే త్వరగా నయం అవుతుందని ఆయన తెలిపారు