బాసర క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు: 7వ రోజు కాళరాత్రి దేవి దర్శనం

బాసర దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కాళరాత్రి దేవి

ములా నక్షత్రంలో “కాళరాత్రి దేవి” అవతారంలో అమ్మవారి దర్శనం
అక్షరాభ్యాసానికి విశేషంగా అక్షర శ్రీకర పూజలు
ఉచిత అన్నదాన కార్యక్రమాలు పర్యవేక్షణలో

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజు ములా నక్షత్రం సందర్భంగా అమ్మవారు “కాళరాత్రి దేవి” రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అక్షరాభ్యాస మండపాల్లో వైదిక పూజలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల 7వ రోజు, మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు “కాళరాత్రి దేవి” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశేష పూజలతో పాటు వైదిక పద్ధతిలో అష్టోత్తర నామార్చనలు, చతుఃషష్టి ఉపచార పూజలు నిర్వహించి అమ్మవారికి కూరగాయలతో కిచిడీ నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంలో అక్షరాభ్యాసానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో ఉదయం 2 గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు భక్తుల రద్దీని గమనించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, మరియు ఉచిత అన్నదాన కేంద్రాలు వివిధ మహారాజుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment