కులమతాలకు తవ్వికుండా మానవతా చాటుకున్న శాంతి నగర్ దుర్గామాత యూత్ – రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకునికి చేయూత
మనోరంజని, తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, అక్టోబర్ 19
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన శాంతినగర్ కాలనీ వాసి షేక్ పయాజ్, ఎనిమిది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి వైద్యం కోసం పోరాటం సాగుతున్న ఆయనకు దుర్గామాత యూత్ సభ్యులు, గ్రామస్థుల సమన్వయంతో మానవతా దృక్పథంతో చేయూత అందించారు.
కులమతాల భేదాలను పక్కనపెట్టి, దీపావళి పండుగ సందర్భంగా పయాజ్ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడటంతో పాటు, ఆహార సామగ్రి వంటి అవసరమైన వస్తువులను కూడా అందించారు. ఈ కార్యంలో పాల్గొన్నవారు మానవతా విలువలు ఉన్నతంగా నిలబెట్టారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, “షేక్ పయాజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కుటుంబ ఆర్థిక స్థితి కూడా దయనీయంగా ఉంది. అలాంటి సమయంలో మనమంతా కలిసికట్టుగా ఉండి, అతనికి అవసరమైన వైద్యం కోసం మరింత చేయూత అందించాలి,” అని అన్నారు.
ఈ ఘట్టం, మానవత్వమే మతం అనే నినాదానికి జీవింత ఉదాహరణగా నిలిచింది.