మానవత్వం పరిమళించిన షకీల్ – చిన్నారి కోసం రూ.50 వేలు సహాయం

మానవత్వంతో ముందుకొచ్చిన షకీల్ – చిన్నారి కోసం సహాయం

M4News ప్రతినిధి

📍 మహబూబాబాద్ | ఫిబ్రవరి 07, 2025

🔹 పసిబిడ్డ చికిత్స కోసం మహ్మద్ షకీల్ మానవత్వంతో స్పందించి రూ.50 వేలు సహాయం
🔹 మతసామరస్యానికి చిరునామాగా మారిన మార్వాడీ బజార్ వ్యాపారి
🔹 చికిత్స ఖర్చు మోయలేక దాతల సహాయాన్ని కోరిన తల్లిదండ్రులు
🔹 “మతం కాదు, మానవత్వమే ముఖ్యం” అని నిరూపించిన ఉదార హృదయం

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రుతప్రియాన్సిని (4) అనే పసిబిడ్డ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు కావాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా పూర్తిగా ఖర్చును సమకూర్చలేక, దాతల సహాయాన్ని కోరారు.

ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మార్వాడీ బజార్‌లో క్లాసిక్ కూలర్స్ అండ్ హోమ్ నీడ్స్ యజమాని మహ్మద్ షకీల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సహాయానికి ముందుకొచ్చిన షకీల్

పసిబిడ్డ పరిస్థితి తెలుసుకున్న షకీల్ బాధిత కుటుంబాన్ని ఇంటికి పిలిచి దైర్యం చెప్పి, రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు.

🔸 “నేను ముస్లిం అయినా, ఆపదలో ఉన్నది ఒక చిన్నారి. మతాన్ని కాదు, మానవత్వాన్ని ముందుకు పెట్టాలి” అని షకీల్ అన్నారు.
🔸 “భగవంతుడు ఈ చిన్నారిని కాపాడాలి” అని ప్రార్థించారు.

మత సమగ్రతకు ప్రతీకగా మారిన షకీల్

ఈ సంఘటన మతాలకు అతీతంగా మానవత్వం ఎలా పని చేస్తుందో మరోసారి రుజువు చేసింది. షకీల్ చేసిన ఈ సహాయం ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment