సేవే సంకల్పంగా… “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” వృద్ధుడికి ఘన అంతిమ సంస్కారం
ప్రొద్దుటూరు, జనవరి 16 (మనోరంజని తెలుగు టైమ్స్):
ప్రొద్దుటూరు ప్రాంతంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్లో కె. నరసింహులు అనే వృద్ధుడు అనారోగ్య కారణంగా మృతి చెందగా, కుటుంబసభ్యులు మరియు బంధువులు అంతిమ సంస్కరణలకు ముందుకు రాకపోవడం వలన, ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్ ను సంప్రదించగా, వారు వెంటనే స్పందించారు.
ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదానం ప్రకారం అంతిమ సంస్కరణలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, సురేష్, కిరణ్ కుమార్ తదితరులు పూజా కార్యక్రమాలను నిర్వహించి అంత్యక్రియలను పూర్తి చేశారు.
చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు.
వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు:
📞 82972 53484, 9182244150