ప్రయాణికుల సౌకర్యార్థం మెర్క్యూరీ లైట్లు ఏర్పాటు
బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 14
మండల్ కేంద్రమైన బాసర ఆలయం వెళ్లే రెండవ ఆర్చి గేట్, రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ చౌక్ లో రాత్రిపూట లైట్లు లేక ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం దృష్టిలో పెట్టుకొని బాసరకు చెందిన అఫ్రోజ్ డిజె సౌండ్స్ ఆధ్వర్యంలో సుమారు రూ.6 వేల విలువగల నాలుగు మెర్క్యూరీ లైట్లను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిగించి మానవత్వం చాటుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెర్క్యూరీ లైట్లు బిగించిన అఫ్రోజ్ ను స్థానికులు, గ్రామస్తులు అభినందించారు.