జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు
మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025
జాతీయ హైవే వినియోగదారులకు సౌకర్యం కల్పించేందుకు జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ (NHAI) ప్రకటించింది.
ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ఆయా రహదారి ప్రాజెక్టుల సంబంధిత వివరాలు, నేషనల్ హైవే నంబర్, ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడవు, గస్తీ సిబ్బంది, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ సంప్రదింపు నంబర్లు లభిస్తాయి.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సహాయంగా హెల్ప్‌లైన్ నంబర్ 1033, సమీపంలోని పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు వంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
ఈ క్యూఆర్ కోడ్లను రహదారి స్తంభాలపై, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.