ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వయంపాలన దినోత్సవం
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ సెప్టెంబర్ 03
స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవము, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతి విద్యార్థిని మార్గదర్శకంగా చేసుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. బాలికల జూనియర్ కళాశాల ఇప్పటికే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి మంచి స్థాయిలో ఉన్నందున భవిష్యత్తులో కూడా ప్రతి విద్యార్థి మంచి ర్యాంకులు సాధించేందుకు బాగా చదవాలని అన్నారు. కళాశాలలో అనుభవం కలిగిన మంచి బోధన, బోధనేతర సిబ్బంది ఉండడంవల్ల ర్యాంకులు సాధిస్తాం అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాత్రలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించిన విద్యార్థినులకు ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజుతో పాటు కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బహుమతులను అందజేశారు.